1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Web Series Crew Litter Road With Fake Currency Notes

చిక్కుల్లో షాహిద్ కపూర్... రోడ్లపై నకిలీ కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం

Web Series
Shahid Kapoor
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ చిక్కుల్లో పడ్డాడు. అయితే తాజాగా షాహిద్, విజయ సేతుపతి, రాశికన్నా, రెజినాతో కలిసి 'సన్నీ' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సిరీస్ లో భాగంగా యాక్సిడెంట్ సన్నివేశాన్ని ముంబైలోని వాసాయ్‌లో చిత్రీకరించారు. 
 
ఆ సీన్‌లో యాక్సిడెంట్ జరిగి.. రోడ్డుపై కరెన్సీ నోట్టు కుప్పలు కుప్పలుగా పడిపోతాయి. అయితే. ఈ సీన్ షూట్ చేయడం కోసం.. నకిలీ నోట్లను ఉపయోగించారు. కానీ షూటింగ్ అయిపోయాక.. ఆ నోట్లను తీయడం మర్చిపోయారు యూనిట్ సభ్యులు. 
 
దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అవి నిజమైన డబ్బులే అనుకొని ఏరుకునేందుకు ఎగబడ్డారు. స్వల్ప ఉద్రికత కూడా ఏర్పడింది. కానీ, అసలు విషయం తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారిస్తున్నారు.
 
దీని మీద చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. షూటింగ్ అయిపోయకా.. ఆ నకిలీ నోట్లను తీసివేశాం.. కానీ ఆ నకిలీ నోట్లు మళ్లీ అక్కడికి ఎలా వచ్చాయో తెలియడం లేదు. మహాత్ముడుని అవమానించాలనే ఆలోచన ఏ మాత్రం వారికీ లేదని తెలిపారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జీవితకు సపోర్ట్ చేశాం.. అంతా నరేష్ వల్లే జరిగింది.. మెగా బ్రదర్