బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (12:36 IST)

జీ5 సంకల్పం-హైదరాబాద్‌లో ఉచిత వ్యాక్సినేషన్‌

G5 Sankalpam
భారతదేశంలో అగ్రగామి ఓటీటీ వేదిక ‘జీ5’. వివిధ భాషలు, జానర్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను అందిస్తూ, దేశంలో ఇంటింటికీ చేరువైంది. ప్రజలందరికీ వినోదాన్ని పంచుతోంది. జీ5 ఎప్పుడు ఏం చేస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తుంటారు. వినోదం అందించడమే కాదు, ప్రజల ఆరోగ్యానికీ జీ5 ప్రాముఖ్యం ఇస్తోంది. ‘జీ5 సంకల్పం’ పేరుతో ఉచిత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై 30 నుంచి ఆగస్టు 8 వరకూ హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
 
జీ5 ఇండియా ఛీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మనీషా కార్లా మాట్లాడుతూ, ‘‘ప్రజలకు ఉత్తమ వినోదం అందించడమే జీ5 ప్రధాన లక్ష్యం. వివిధ భాషలు, వివిధ ప్రజల అభిరుచికి తగ్గట్టు కంటెంట్‌ అందిస్తున్నాం. వినోదం అందించడంతో పాటు ప్రస్తుత కష్టకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాం. ‘జీ5 సంకల్పం’ ద్వారా వీలైనంతమందికి వ్యాక్సిన్‌ అందించాలని అనుకుంటున్నాం. బాధ్యతాయుతమైన సంస్థగా ప్రజలకు వ్యాక్సిన్‌ మీద అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం చేపట్టాం’’ అన్నారు.
 
కరోనా వ్యాక్సిన్‌ ఆవశ్యకతను, అవసరాన్ని ప్రజలకు చెప్పడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పిండచమే ‘జీ5 సంకల్పం’ ముఖ్య ఉద్దేశం. వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకుంటున్న హైదరాబాద్‌ ప్రజలు జూలై 20 నుంచి 26 వరకూ https://atm.zee5.com వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 30 నుంచి ఆగస్టు 8వరకూ, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుంది. కోవీషీల్డ్‌ (తొలి డోసు), కోవీషీల్డ్‌ లేదా కోవాగ్జిన్‌ (రెండో డోసు – తొలి డోసు ఏదీ తీసుకుంటే అది) ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
 
కొవిడ్‌ నిబంధనల ప్రకారం, 18 సంవత్సరాల వయసు నిండిన వ్యక్తులు https://atm.zee5.com వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. తేదీ, సమయం ఎంపిక చేసుకోనే వెసులుబాటు ప్రజలకు ఉంది. వ్యాక్సిన్‌ లభ్యతను బట్టి వెబ్‌సైట్‌లో స్లాట్స్‌ అందుబాటులో ఉంటాయి.
 
జీ5 ప్రారంభం నుంచి తెలుగుతో సహా వివిధ భాషల్లో ఒరిజినల్స్‌, మూవీస్‌, టీవీ షోస్‌, వెబ్‌ సిరీస్‌లు విడుదల చేస్తూ వస్తోంది. తెలుగు ప్రేక్షకుల్లో పాపులర్‌ అయ్యింది.