గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (13:36 IST)

మా ఎన్నికల్లో ఓటు వేశారనే షూటింగ్‌లకు హాజరుకావాలి!

ఈ నెల 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్‌కు మ‌రో మూడు రోజుల స‌మయం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో నటీనటులకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ  విజ్ఞప్తి చేసింది. 
 
'మా' ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఈ నెల 10వ‌ తేదీన ఓటు వేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో అందులో పాల్గొన‌కుండా సినీన‌టులు షూటింగుల‌కు వెళ్లే అవ‌కాశం ఉండ‌డంతో ఎన్నికల అధికారి నిర్మాత‌ల మండ‌లికి అభ్యర్థన చేయ‌డంతో ఆ మండ‌లి ఈ ప్ర‌కట‌న చేసింది.  
 
ఆదివారం ఉదయం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మా ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎన్నిక‌లకు స‌మయం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ప్ర‌కాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెల్ స‌భ్యులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌టం కాక రేపుతోన్న విష‌యం తెలిసిందే.