సంబంధిత వార్తలు
- మధ్యతరగతి సమస్యలపై ఈశ్వర్ కథతో సూర్యాపేట్ జంక్షన్ ట్రైలర్
- 'కల్కి 2898 AD'పై లీగల్ నోటీస్.. జారీ చేసింది ఎవరో తెలుసా?
- విజయవాడలోని పుష్కరఘాట్ వద్ద శనీశ్వర- కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన ప్రసాద్ చలవాడి
- మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి
- జాతకాలన్ని మూఢనమ్మకాలు నమ్మేవాళ్లందరూ దద్దమ్మలు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ
సూర్యాపేట్ జంక్షన్ లో ఏంజరిగింది ?
Eeshwar, Naina Sarwar
ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు డిజిటిల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన "మ్యాచింగ్.. మ్యాచింగ్" సాంగ్ తో పాటు టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారు, హిట్టు చేస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చాలా సహజంగానే ఉంటాయి. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాను థియేటర్ లలో చూసి మీరందరూ మమ్మల్ని అదరిస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు.
ప్రొడ్యూసర్ అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ... "మా సూర్యాపేట్ జంక్షన్ మూవీ ఈ నెల 25న ఆంధ్రా, తెలంగాణాలలో గ్లోబల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ లో విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ కి, రాంమోహన్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సూర్యాపేట్ జంక్షన్ సినిమాని థియేటర్ లలో ప్రతి ఒక్కరూ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని అన్నారు.
