ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: విజయవాడ , సోమవారం, 29 ఏప్రియల్ 2024 (20:38 IST)

విజయవాడలోని పుష్కరఘాట్ వద్ద శనీశ్వర- కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిన ప్రసాద్ చలవాడి

Shaneeshwara and Kashi Vishweshwar Swamy temple at Pushkar ghat, Vijayawada
విజయవాడలోని పుష్కరఘాట్ వద్ద పునర్నిర్మించిన శనీశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా 'విగ్రహ ప్రతిష్ట' కార్యక్రమాన్ని సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌కెఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి, ఆయన సతీమణి చలవాడి వెంకట ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.  విగ్రహ ప్రతిష్ట- ఇతర పూజా కార్యక్రమాలను శ్రీ సచ్చిదానంద సరస్వతి మార్గనిర్దేశనంలో చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శనం కోసం  భక్తులను అనుమతించారు. 
 
ఈ సందర్భంగా SSKL డైరెక్టర్లతో పాటు ప్రమోటర్లను ఆలయ అర్చకులు ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి మాట్లాడుతూ... విజయవాడ ప్రజలకు ఈ దేవాలయం తప్పకుండా శాంతి, సంపద, ఆరోగ్యం, అదృష్టాన్ని ప్రసాదిస్తుందన్నారు.
Prasad Chalavadi and Family
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో విస్తృత శ్రేణిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్న SSKL అల్ట్రా-ప్రీమియం, ప్రీమియం చీరలు, లెహంగాలు మరియు పురుషులు మరియు పిల్లల ఎత్నిక్ వస్త్రాలతో సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది.