1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (19:07 IST)

క్వార్టర్ మేటర్... రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా... మండదా చెల్లీ : నారా లోకేశ్ సెటైర్లు

nara lokesh
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయిదాడి కేసుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా, మండదా చెల్లీ, మండదా అన్నా అంటూ వ్యాఖ్యానించారు. విజయవాడలో సతీశ్ కుమార్ అనే యువకుడు సీఎం జగన్‌పై రాయి విసిరినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సతీష్ కుమార్ వద్ద జరిపిన పోలీసుల విచారణంలో జగన్ ర్యాలీకి వస్తే క్వార్టర్ బాటిల్, రూ.350 డబ్బులు ఇస్తామని వైకాపా నేతలు తనను సీఎం సభకు తీసుకెళ్లారని, క్వార్టర్ బాటిల్ ఇచ్చి, రూ.350 డబ్బులు ఇవ్వలేదని అందుకే జగన్‌పై రాయితో దాడి చేసినట్టు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు.
 
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ర్యాలీలో రాళ్ళ దాడి జరిగిన సంఘటనపై సీఎం జగన్ వ్యంగ్యంగా స్పందించిన విషయం తెల్సిందే. అలాగే, విజయవాడలో సోమవారం గుడివాడలో సభలో మండదా అక్కా, మండదా చెల్లీ, మండదా తమ్ముడూ, మండదా అన్నా అంటూ తన ట్రేడ్ మార్క్ ప్రసంగం చేశారు. దీనిపై నారా లోకేశ్ తనదైనశైలిలో సెటైర్లు వేశారు. క్వార్టర్ మేటర్, ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా.. మండదా చెల్లీ, మండదా తమ్ముడూ, మండదా అన్నా అంటూ ఎద్దేవా చేశారు.