1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. romeo releasing on 10th october

అక్టోబర్ 10న పూరీ రాసిన ప్రేమకథ రోమియో రిలీజ్!

romeo releasing on 10th october
సాయిరామ్ శంకర్, అదోనిక జంటగా నటించిన ప్రేమకథా చిత్రం రోమియో. ఈ చిత్రానికి పూరి శిష్యుడు గోపి గణేష్ దర్శకత్వం వహించారు. తమ్ముడు సాయిరాం శంకర్ కోసం పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథను స్వయంగా సమకూర్చారు. వాస్తవంగా, ఈ సినిమా మూడేళ్ల క్రిందటే పూర్తయ్యింది. అయితే, ఫైనాన్షియల్ సమస్యల వల్ల విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.
 
ఎట్టకేలకు, ఈ చిత్రం అన్ని అవాంతరాలను అధిగమించి అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రోమియో ట్రైలర్స్‌కు, ప్రోమోస్‌కు పరిశ్రమలోని ప్రముఖల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరక్టర్లు ఈ చిత్రం విజువల్స్‌ను విపరీతంగా మెచ్చుకున్నారు.
About Writer
Selvi