సంబంధిత వార్తలు
- హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' ట్రైలర్ రాబోతుంది
- సరిపోదా శనివారం నుంచి నాని పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్
- శ్రీలంక క్రికెటర్లకు జయసూర్య క్లాస్.. హెయిర్ స్టయిల్ సాధారణంగా ఉండాలంటూ ఆదేశం..
- కంగువ లోని ఫైర్ సాంగ్ తో ఎమోషనల్ పండించిన హీరో సూర్య
- నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ
సాహసోపేత పోరాటాలతో ఆకట్టుకునేలా కంగువ ట్రైలర్ వచ్చేసింది
Kanguva trailer poster
'కంగువ' ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఒక అందమైన దీవిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. రహస్యాలెన్నో ఆ దీవిలో దాగిఉన్నాయి. యుద్ధాలు, ఆక్రమణలు చేస్తూ ఎదురొచ్చిన వారిని క్రూరంగా చంపే భయంకరమైన విలన్ గా బాబీ డియోల్ కనిపించారు. అతనే ఒక సైన్యం లాంటి కంగువ పాత్రలో సూర్య మేకోవర్, ఫెరోషియస్ పర్ ఫార్మెన్స్ ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తోంది. నాయకుడిగా తన వారిని కాపాడుకునేందుకు కంగువ చూపించే ధీరత్వం, చేసే సాహసోపేత పోరాటాలు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి. భారీ నౌకలపై జరిగే యుద్ధ సన్నివేశాలు వరల్డ్ సినిమాను గుర్తుచేసేలా ఉన్నాయి. హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా 'కంగువ' అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.
నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
