సంబంధిత వార్తలు
- చాక్లెట్ ఇస్తానని నమ్మించింది... జ్యూస్ అని యాసిడ్ తాగించింది..
- Stray Dog: వీధి కుక్కల బెడద.. చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడి మృతి
- తండ్రి మందలించాడని.. సైకిల్‌పై రాత్రంతా తొక్కుతూ 100 కిలోమీటర్లు.. ఎక్కడా ఆగలేదు..
- Naga Shaurya: నాకు అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నా : నాగశౌర్య
- కోతులకు పెట్టిన విషపూరిత ఆహారం ఆరగించి చిన్నారి మృతి
గొరిల్లాల ఎంక్లోజర్‌లో పొరబాటున జారిపడిన బాలుడు, ఆ గొరిల్లా ఏం చేసిందంటే? వీడియో
జంతు ప్రదర్శన శాలలకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొందరు జంతువులను దగ్గరగా చూడాలనుకుని అత్యుత్సాహం చూపించడం వల్ల ప్రమాదాలకు గురవుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ బాలుడు గొరిల్లాల ఎంక్లోజర్ లోపల పడిపోయాడు.
అంతే.. ఒక్కసారిగా గొరిల్లాల గుంపు అక్కడికి వచ్చింది. అందులో ఓ పెద్దగొరిల్లా ఆ బాలుడిని నిశితంగా గమనించింది. బాలుడు భూమిని అతుక్కున్నట్లు పడిపోయి వున్నాడు. కొద్దిసేపు అతడినే గమనించింది. అటుఇటూ తిరిగిన గొరిల్లా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడిని సురక్షితంగా ఆ ఎంక్లోజర్ నుంచి కాపాడారు.
No matter how many times I watch it, it still hits hard
— Varsha Singh (@varshaparmar06) April 19, 2026
In 1986 at Jersey Zoo, a boy fell into a gorilla enclosure—and a huge silverback, Jambo, gently protected him until help arrived.
A real moment that shows the quiet kindness of animals pic.twitter.com/GuTIO4KnfO
