1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Criminal case filled against Prakash Raj for insulting Ramayana

శ్రీరామ లక్ష్మణులు వలస కూలీలు.. ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు (video)

Prakash Raj
Prakash Raj
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదైంది. అత్యంత పవిత్రంగా భావించే రామాయణంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా, కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. శ్రీరాముడు, లక్ష్మణులను ఉత్తర భారతం నుండి వచ్చిన వలస కూలీలుగా ఆయన అభివర్ణించారు. 
 
వారు దక్షిణాదికి వచ్చి, ఒక గిరిజనుడైన రావణుడికి చెందిన పొలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఈ దొంగతనాన్ని రావణుడు ప్రశ్నించినందుకే వారి మధ్య వివాదం మొదలైందని, అది కాస్తా పెద్ద యుద్ధానికి దారితీసిందని ప్రకాశ్ రాజ్ విశ్లేషించారు. 
 
అంతేకాకుండా, శూర్పణఖ ప్రస్తావన తెస్తూ.. ఆమె జీఎస్టీతో కలిపి 2000 డాలర్లు చెల్లించాలని కోరినట్లుగా ఎద్దేవా చేయడం గమనార్హం. పవిత్ర ఇతిహాసాన్ని ప్రస్తుత పన్నుల విధానంతో ముడిపెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఇంకా రామాయణాన్ని అవమానించినందుకు ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
రాష్ట్రపతి కోసం భద్రత: గర్భిణీ మహిళ కోసం ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసిన పోలీసులు.. శభాష్