1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Liquor shops reopen: Women in long queues outside shops in Karnataka

తాగుబోతులకు పండగే పండగ... మందు కోసం అమ్మాయిల క్యూ

Liquor Shops
కరోనా వైరస్ దెబ్బకు గత 45 రోజలుగా మందు బాబులు మద్యం లేక తల్లడిల్లిపోయారు. కానీ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్రం ఆంక్షలను సడలించింది. అంటే, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చింది. ఈ వార్త మద్యంబాబులకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మద్యంషాపులు తెరవగానే మద్యంబాబులు వైన్ షాపుల ఎదుట నానా హంగామా చేశారు. టపాకాయలు పేల్చారు. కొబ్బరి కాయలు కొట్టారు. ఆపుకోలేని సంతోషంతో మద్యం దుకాణాల ముందే డ్యాన్సులు వేశారు. ఒక విధంగా చెప్పాలంటే మద్యం దుకాణాల ఎదుట పండగ వాతావరణమే నెలకొంది. 
 
అయితే, కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైన్ షాపుల ఎదుట మద్యం కోసం అనేక మంది అమ్మాయిలు కూడా వరుసలో నిలబడటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యం కలిగిచింది. ఇలాంటి వారంతా హైక్లాస్ వర్గానికి చెందినవారుగా ఉన్నారు. ముఖ్యంగా, బార్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతి లేదు. దీంతో ఉన్నత వర్గాలకు చెందిన అమ్మాయిలు, మహిళలు వైన్ షాపుల ఎదుట వరుసలో నిలబడి మద్యం కొనుగోలు చేసేందుకు అమితాసక్తిని చూపించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. షాపుల్లో స్టాక్ తక్కువగా ఉందని, డిమాండ్ మేరకు అందరికీ కావాల్సిన లిక్కర్‌ను అందిస్తామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అవసరం ఉన్న చోటకు అదనపు స్టాక్స్‌ను పంపుతున్నామని తెలిపారు. 
About Writer
ఠాగూర్