1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (13:40 IST)

ఏపీలో కరోనా జోరు : మరో 67 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో మరో 67 మందికి ఈ వైరస్ సోకింది. వీటితో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కు చేరింది. 
 
కాగా, గత 24 గంటల్లో 10,292 శాంపిళ్లను పరీక్షించగా 67 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే, ఇప్పటివరకు 524 మంది ఆస్పత్రుల నుంచి ఇంటికివెళ్లగా, మరో 33 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,093గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. 
 
ఇకపోతే, రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 1, గుంటూరులో 19, కపడలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 491కి చేరాయి.
 
ఇక జిల్లాల వారీగా మొత్తం కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 78, చిత్తూరు 82, ఈస్ట్ గోదావరి 45, గుంటూరు 338, కడప 87, కృష్ణ 278, కర్నూలు 491, నెల్లూరు 91, ప్రకాశం 61, శ్రీకాకుళం 5, విశాఖపట్టణం 35, విజయనగరం 0, వెస్ట్ గోదావరి 59 చొప్పున మొత్తం 1650 కేసులు నమోదైవున్నాయి.