బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (10:21 IST)

రేపోమాపో అంటూ ఉన్న కరోనా రోగిని సాధారణ స్థితికి తెచ్చిన మందు...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం సరైన మందును కనిపెట్టలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం అందుబాటులో ఉన్న అన్ని రకాల మందులను వాడుతున్నారు. ముఖ్యంగా, మలేరియా జ్వరం నివారణ కోసం వాడే హైడ్రాక్సీక్వోరో క్వీన్ మాత్రలు మాత్రం కొంతమేరకు పని చేస్తున్నట్టు పలు పరిశోధనలు వెల్లడించాయి. దీంతో ఆ మాత్రల కోసం ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూశాయి. ప్రపంచ దేశాల వినతి మేరకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు.. అనేక దేశాలకు ఈ మాత్రలను భారత్ ఎగుమతి చేసింది. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రోగులపై మరో మందు అద్భుతంగా పని చేస్తున్నట్టు తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బారినపడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ వచ్చిన ఓ రోగికి ఆ మందును ఇంజెక్షన్ రూపంలో శరీరంలోకి ఎక్కించగా, అది బాగా పని చేసింది. ఫలితంగా వెంటిలేటర్‌పై ఉన్న రోగి సాధారణ స్థితికి వచ్చాడు. దీంతో ఈ మందుపై ఇపుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇంతకీ ఆ మందు పేరు ఏంటంటే... ఇటోలీజుమ్యాబ్. మన దేశానికి చెందిన బయోకాన్ సంస్థ ఈ మందును తయారు చేస్తుంది. ఒక డోసు ధర రూ.60 వేలు. ఈ మందును ముంబై కేంద్రంగా ఉండే నాయిర్ ఆస్పత్రి వైద్యులు కరోనా రోగిపై ప్రయోగించగా, మంచి ఫలితం వచ్చింది. వెంటిలేటర్ పై ఉన్న ఇద్దరు రోగులకు దీన్ని అందించగా, వారి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరిందని నాయిర్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. 
 
కాగా, ఇటోలీజుమ్యాబ్‌ను దేశంలోని బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. ఒక డోస్ ఇంజక్షన్ ఖరీదు రూ.60 వేలు. కరోనాపై తమ ఔషధం సత్ఫలితాలను ఇస్తోందని తెలుసుకున్న బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా వాడేందుకు ఈ మందును ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించారు. 
 
అలాగే, ఈ డ్రగ్ పనిచేసిందని నాయిర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన తర్వాత కింగ్ ఎడ్వర్డ్ స్మారక ఆసుపత్రిలో 35 ఏళ్ల కరోనా పాజిటివ్ రోగికి ఔషధాన్ని ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇక వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 125 మంది పేద రోగులకు కూడా ఇటోలీజుమ్యాబ్ ఇవ్వాలని భావిస్తున్న బీఎంసీ అధికారులు, ఆ మేరకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. మొత్తంమీద ఇటోలీజుమ్యాబ్ మందు కరోనాపై పనిచేస్తే.. మరోమారు ప్రపంచ దేశాలు మన దేశంపై ఆధారపడాల్సి వస్తుంది.