సిక్కు యాత్రికులు 173 మందికి కరోనా.. కారణం ఏమిటంటే?
సిక్కు యాత్రికులు 173 మందికి కరోనా సోకింది. ఇప్పటికే కరోనాతో పంజాబ్‌లో 20మంది మృతి చెందారు. మార్చి నెలలో మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుద్వారా హజూర్ సాహిబ్‌కు పంజాబ్ నుంచి 3,500 మంది సిక్కు యాత్రికులు వెళ్లారు. లాక్‌డౌన్ అమలుతో సిక్కు యాత్రికులందరూ నాందేడ్‌లోనే ఉండిపోయారు.
కేంద్ర హోంశాఖ అనుమతితో సిక్కు యాత్రికులను ప్రత్యేక బస్సులో పంజాబ్‌కు తరలించారు. ఆ తర్వాత క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా 173 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సిక్కు యాత్రికులకు మహారాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు చేయకుండా, నిర్లక్ష్యం వహించడంపై పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది.
ఈ ఘటనపై అకాలీదళ్ నాయకులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని అకాలీదళ్ డిమాండ్ చేసింది.