శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (13:45 IST)

తెలంగాణలో పల్లీల వ్యాపారి నిర్లక్ష్యం.. ఐదుగురికి కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయితే తెలంగాణలో అమలు చేస్తున్న నిబంధనలు మరింత కఠినతరం చేయడంతో ఇప్పుడిప్పుడే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా సులభంగా ఇతరులకు సోకుతోంది. ప్రస్తుతం ఓ పల్లీల వ్యాపారి అదే పని చేశాడు. ఫలితంగా తెలంగాణలో మొత్తం ఆరు కొత్త పాజిటివ్ కేసులు నమోదైనాయి.
 
ఈ ఆరు పాజిటివ్ కేసుల్లో ఐదు పాజిటివ్ కేసులు రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఈ ఐదు పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోని చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడానికి కారణం ఒక పల్లీల వ్యాపారి అని అధికారులు గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. సరూర్ నగర్‌లోని మలక్పేట్‌‍కు చెందిన ఓ పల్లీల వ్యాపారి కారణంగా ఐదు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఆ పల్లీల వ్యాపారి కుటుంబ సభ్యులందరినీ వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా వారందరికీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక వైరస్ బాధితులను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.