సంబంధిత వార్తలు
- గుంటూరులో వింత పురుగులు... ఒంటిపై వాలితే దురద, దద్దుర్లు
- ఏడుగురు మంత్రులు, 700 కోట్లు డబ్బు సంచులు, తిరుపతిలో 4 లక్షల మెజారిటీ, ఎవరు?
- తాయత్తు కోసం పులి మీసాన్ని కట్ చేసిన అధికారులు.. లేఖ వైరల్
- భారత్‌ను 200 ఏళ్లు పాలించిన అమెరికా, హేయ్... మళ్లీ వేసేశారుగా ఉత్తరాఖండ్ సీఎం
- కింగ్ కోబ్రాకు చుక్కలు చూపించిన ముంగిస.. ఎలా..?
తిరుమల శ్రీవారి హుండీలో డబ్బు చోరీ చేస్తుండగా దిమ్మతిరిగే ట్విస్ట్!
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి హుండీకే కన్నం వేయాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. పక్కా ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని హుండీలో ఓ యువకుడు చోరీకి ప్రయత్నించాడు. నిందితుడు హుండీలోని రూ. 30 వేలు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.
ఇంతలో విజిలెన్స్ అధికారులు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం సీసీటీవీ కెమెరాల ద్వారా అతడి చోరీ బండారాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు.
సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా, శ్రీవారి ఆలయ హుండీలోనే చోరీకి ప్రయత్నించడం తిరుమలలో తీవ్ర చర్చనీయాంశమైంది.
