1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Rajasthan Crisis LIVE Updates: Sachin Pilot dropped from Rajasthan Cabinet; sacked as state

రంజుగా మారిన రాజస్థాన్ రాజకీయం : సచిన్ పైలట్‌పై వేటు పడింది...

Rajasthan Crisis
రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న యువ నేత సచిన్ పైలట్‌పై వేటుపడింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు... పీసీసీ చీఫ్ పదవి నుంచి సచిన్ పైలట్‌ను తొలగించారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే, ఆయన అనుచరవర్గానికి చెందిన మరో ఇద్దరిపై వేటు వేసింది. గెహ్లాట్ ప్రభుత్వాన్ని అస్తిరపరచాలని సచిన్ పైలట్ అనుకున్నారని కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. 
 
అంతకుముందు, రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 104 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు సమాచారం. సోమవారం జరిగిన మొదటి సమావేశంలో సైతం ఇదే సంఖ్యలో ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ప్రకటించారు. కాగా వరుసగా రెండు రోజు సమావేశానికి వందకుపైగా ఎమ్మెల్యేలు పాల్గొనడంతో రాజస్థాన్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదనే తెలుస్తోంది.
 
మరోవైపు సచిన్ పైలట్‌కు భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ నేత ఓం మథుర్ ప్రకటించారు. బీజేపీలోకి చేర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టంచేశారు. కాగా, బీజేపీతో అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ పార్టీ నుంచి అధికారికంగా ఆహ్వానం రావడం ఇదే తొలిసారి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రాజస్థాన్ సంక్షోభం : నమ్మిన బంటులే నట్టేట ముంచారు? రాహుల్ అంతర్మథనం!!