గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జులై 2020 (12:46 IST)

కోటి 19 లక్షలు దాటిన కరోనా కేసులు.. భారీగా పెరుగుతున్న మృతులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య కోటి 19 లక్షలు దాటింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,19,50,389 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,46,629 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 68,95,547 మంది కోలుకున్నారు. 
 
ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 30,97,084 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,33,972 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 13,54,863 మంది కోలుకున్నారు.