శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (14:27 IST)

మధ్యప్రదేశ్‌లో దారుణం.. మాస్క్‌ లేదని కిడ్నీ దెబ్బతినేలా కొట్టారు..

Police
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. మాస్క్ ధరించలేదని ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని అలిరాజాపూర్‌లో కుటుంబంతో కలిసి బైకు వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసు కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. గొడవ కాస్త పెద్దదైంది. చుట్టుపక్కల వాళ్లు గొడవను ఆపకుండా మరింత సహకరించారు. 
 
ఇంకా పోలీస్‌‌కు కర్ర అందించాడు. ఈ ఘటన కాస్త వైరల్‌గా మారడంతో అధికారులు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. ఇందులో బాధాకరం ఏంటంటే ఆ దెబ్బలకు యువకుడి కిడ్నీ ఒకటి దెబ్బతింది.
 
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. అయినా ప్రజలు నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఎవరైనా ఎన్నిరోజులని చెప్తారు. ఎన్నివిధాలుగా ప్రయత్నించినా మాటవినడం లేదు. అందుకని ఓ పోలీస్ మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ యువకుడిని చితకబాదాడు కేవలం మాస్క్ పెట్టుకోలేదనే కారణంతోనే ఈ సంఘటన జరిగింది.