1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Train Driver Stops En Route To Buy Dahi; Video Leaves Internet In Splits

పెరుగు తినాలనిపించి ట్రైన్‌ను ఆపేశాడు.. లోకోపైలట్‌ సస్పెండ్

Train Driver
లోకో పైలట్ పెరుగు తినాలనిపించి ఏకంగా ట్రైన్‌ను మధ్యలోనే నిలిపివేశాడు. పాకిస్తాన్‌లో ఈ ఘటనలో వెలుగులోకి వచ్చింది.  ఆ తరువాత విషయం తెలుసుకున్న అధికారులు ఆ లోకోపైలట్‌ను సస్పెండ్ చేశారు. 
 
వివరాల్లోకెళితే.. పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సిటీ ట్రైన్ లాహోర్‌ నుంచి కరాచీ వైపు వెళ్తోంది. అయితే, ట్రైన్ డ్రైవర్ పెరుగు కోసం ట్రైన్‌ను మధ్యలో నిలిపివేశాడు. 
 
స్టేషన్‌లోని ఓ షాపు నుంచి పెరుగు ప్యాకెట్ తీసుకుని తిరిగి ట్రైన్ ఎక్కాడు. అయితే, ఇదంతా వీడియో రికార్డ్ చేసిన పలువురు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 
 
ఈ వీడియోను బేస్ చేసుకుని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కారణంగానే.. రైల్వేల భద్రత, నియంత్రణపై అపోహలు నెలకొంటున్నాయని, అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు నెటిజన్లు. 
 
దీంతో సదరు రైలు లోకో పైలట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ ఇజాజ్-ఉల్-హసన్ షా ప్రకటించారు.  
తర్వాతి కథనం
అమ్మా... ఇంతమంది మనింటికి ఎందుకు వచ్చారు? తండ్రి సాయితేజ మరణించిన విషయం తెలియక..?