జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 అధికరణను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. పైగా, ప్రతీకార చర్యలకు దిగింది. ఇరు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసింది. భారత్‌తో వాణజ్యాన్ని తెగదెంపులు చేసుకుంది. భారతీయ సినిమాలు పాకిస్థాన్‌లో ఆడకుండా నిషేధం విధించింది. ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని బహిష్కరించింది. అలాగే, ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ నియామకాన్ని విరమించుకుంది. ఇలాంటి దుందుడుకు...