గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:58 IST)

డామిట్... కూతుర్ని దానం చేయడమేంటి? కన్యాదానానికి అంగీకరించని తండ్రి

కోల్‌కతాకు చెందిన ఓ తండ్రి తన కుమార్తెను కన్యాదానం చేసేందుకు అంగీకరించలేదు. డామిట్.. కుమార్తెను దానం చేయడం ఏమిటంటూ ఆయన పురోహితులను ప్రశ్నించాడు. వారు ఎంత సర్దిచెప్పినా ఆయన అంగీకరించలేదు. దీంతో కొందరు మహిళలు ముందుకు వచ్చి ఆ యువతిని కన్యాదానం చేసి పెళ్లి తంతు ముగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోల్‌కతా నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల తన కుమార్తెకు పెళ్లి చేశాడు. కానీ, కుమార్తెను అప్పగింతల సమయంలో ఆయన మొండిపట్టుపట్టారు. కుమార్తెను మాత్రం కన్యాదానం చేయనని తెగేసి చెప్పాడు. సాధారణంగా 'డబ్బు, ధనం, నగలు, ఆస్తిపాస్తులు వంటివి దానం చేస్తాం.. కానీ  కూతురును దానం చేయడం ఏంటి? దానం చేసినవి మనకు కాకుండా పోతాయి.. కానీ నా కూతురు నాకు కాకుండా పోతుందా?' అంటూ పురోహితులను ప్రశ్నించాడు. 
 
'నా కూతురు పెళ్లైనంత మాత్రాన మొత్తం వారివద్దే ఉండదు… మాతో సంబంధాలు తెగిపోవు. కన్యాదానం చేయను… వరుడికి ఇచ్చి వివాహం మాత్రమే చేస్తాను'  అని చెప్పాడు. మహిళా పురోహితులు కూడా అలాగే చేశారు. ఆ తండ్రి వాదన చూసి అక్కడి బంధువులు అందరూ అతడు చూపించిన ప్రేమను అభినందించారు.