శబరిమలలో సంప్రోక్షణ చేపట్టింది..అందుకు కానేకాదు..
శబరిమలలో సంప్రోక్షణ చేపట్టింది..మహిళల ప్రవేశం కోసం కాదని ప్రధాన పూజారి కీలక నివేదికలో పేర్కొన్నారు. ఆలయం ఎన్నో రకాలుగా అపరిశుభ్రతకు లోనవుతుందని.. అనేక రకాలైన మలినాలు గర్భాలయంలోకి చేరుతుంటాయి. వాటిని తొలగించేందుకు ఇలాంటి సంప్రోక్షణలు జరుపుతుంటామని ప్రధాన పూజారి తెలిపారు.
కేరళలోని సుప్రసిద్ధ అయ్యప్ప ఆలయంలోకి బిందు అమ్మణ్ణి, కనకదుర్గలు ప్రవేశించారు. గత నెలలో వీరి ప్రవేశానికి అనంతరం ఆలయ ప్రధాన పూజారి రాజీవరు, గర్భగుడి తలుపులు మూసివేసి, సంప్రోక్షణం జరిపిన సంగతి తెలిసిందే. ఈ చర్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని బిందు అమ్మణ్ణి కోర్టును ఆశ్రయించింది.
దీనిపై వివరణ ఇవ్వాలని కేరళ సీఎం పినరయి విజయన్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును ఆదేశించారు. జనవరి రెండో తేదీన జరిపిన సంప్రోక్షణ.. మహిళల ప్రవేశానికి విరుద్ధంగా కాదని ప్రధాన పూజారి ఆ నివేదికలో వెల్లడించారు.