శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:52 IST)

పురుషులు అవీ, స్త్రీలు ఇవీ తీసుకుంటే... సంతాన సాఫల్యతకు మార్గం...

ప్రస్తుతకాలంలో దంపతులు ఎదుర్కుంటున్న సమస్య సంతానలేమి. దంపతులలో సంతానం కలగకపోవటానికి భార్యాభర్తలిరువురిలోనూ లోపాలుండవచ్చు. ముఖ్యంగా మగవారిలో వీర్యకణాల లోపం ఉంటే సంతానలేమి సమస్య తలెత్తుతుంది. లోపం ఎవరిదైనప్పటికి ముందు  మనం ప్రకృతిలో సహజసిద్దంగా లభించే కొన్ని పదార్దాలతో సంతాన సమస్యను తొలగించుకోవచ్చు. అవేంటో చూద్దాం. 
 
1. వెల్లులి ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీని పెంచే మంచి ఆహారం. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది. సంతానలేమి సమస్యతో బాధపడేవారికి ఇది మంచి ఔషదంలా పని చేస్తుంది.
 
2. దానిమ్మ గింజలు తీసుకోవడం వలన మగవారిలో వీర్యకణాల సంఖ్యను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి. 
 
3. వీర్యకణాలు పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తినే అరటిలో ఉన్నాయి. దీనిలో బి 1, సి విటమిన్లు ప్రోటీన్లు లభిస్తాయి. అరటిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తివంతమైన శృంగార హర్మోనుగా పనిచేస్తుంది.
 
4. పాలకూరలో ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది వీర్యవృద్ధికి సహకరిస్తుంది. పాలకూరలో విటమిన్ సి, ఐరన్ కూడా లభిస్తాయి.
 
5. చాలామందికి మిరపకాయ గురించి తెలియదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్టిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తుంది. రోజూ మిరపని ఆహారంలో తీసుకుంటే మేలు చేస్తుంది.
 
6. టమాటో... అత్యంత సాధారణంగా వాడే ఈ కూరగాయలో కెరొటినాయిడ్స్, లైకోపీన్ చక్కని వీర్యశక్తి, మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఏదో విధంగా దీనిని భాగం చేసుకోవాలి. 
 
7. పుచ్చకాయలో మగవారి ఫెర్టిలిటీని మెరుగుపరిచే గుణాలున్నాయి. కనుక వాటిని తీసుకుంటే మంచిది.