సంబంధిత వార్తలు
- ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసు : బాధితురాలి తండ్రిని కొట్టి చంపేసిన ఎమ్మెల్యే సోదరుడు
- చంద్రబాబును ముఖ్యమంత్రి చేసింది మేమే: బీజేపీ ఎమ్మెల్యే
- యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం : బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర మృతి
- చంద్రబాబు నియోజకవర్గంలో అవినీతి : సోము వీర్రాజు
- శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భరతగడ్డపై పెళ్లి... విరాట్-అనుష్క ఇటలీలోనా?
బాలికపై అత్యాచారం : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరెస్టు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో 16 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం ఉదయం ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో ఆ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో 16 యేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. శుక్రవారం ఉదయం ఆ రాష్ట్ర రాజధాని లక్నోలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం లక్నో సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆయనపై ఇప్పటివరకు మొత్తం 3 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఐపీసీ 363 (కిడ్నాప్), 366 (మహిళల అపహరణ), 376 (అత్యాచారం), 506 (నేరపూరత బెదిరింపులు) సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.
గత గతయేడాది జూన్‌లో ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారనీ… సంవత్సరం నుంచి పోరాడుతున్నా అధికారులు తనకు న్యాయం చేయలేదని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారంపై కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఈ నెల 3న ఎమ్మెల్యే సోదరుడు, అతడి అనుచరులు బాధితురాలి తండ్రిని చెట్టుకు కట్టేసి దారుణంగా చావబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించగా, పోలీసు కస్టడీలోనే బాధితురాలి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన మొత్తం ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటుపడింది. మరోవైపు, ఇదే కేసులో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సోదరుడు, అతని అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా పెను చర్చనీయాంశమైంది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టి, ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
