సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2017 (17:56 IST)

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భరతగడ్డపై పెళ్లి... విరాట్-అనుష్క ఇటలీలోనా?

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకోవడంపై భాజపా ఎమ్మెల్యే తప్పుబట్టారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భరత గడ్డపై వివాహం చేసుకున్నారనీ, అలాంటిది విరాట్ కోహ్లి ఇక్కడ పుట్టి ఎక్కడో పెళ్లి చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

భారతదేశంలో డబ్బు ఆర్జించి, ఆ డబ్బుతో విదేశంలో పెళ్లి చేసుకోవడమా అని ప్రశ్నించారు. మాతృభూమిపై విరాట్ కోహ్లికి భక్తి లేదనీ, ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా ఎలా నిలుస్తారంటూ భాజపాకు చెందిన గుణ ప్రశ్నించారు. నటి అనుష్క శర్మకు కూడా దేశభక్తి వున్నట్లు లేదనీ, వుంటే ఇటలీలో పెళ్లాడేందుకు అంగీకరించి వుండేది కాదని పేర్కొన్నారు.