మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 13 డిశెంబరు 2017 (20:09 IST)

అనుష్కతో డేటింగ్ తరువాతే నా దశ తిరిగిందంటున్న కోహ్లి

సాధారణంగా ప్రముఖులు ప్రేమించుకోవడం.. విడిపోవడం జరుగుతుంటుంది. కొంతమంది ప్రముఖుల ప్రేమ... పెళ్లి పీటల వరకూ వస్తే మరికొంతమందికి సగంలోనే ఆగిపోతుంది. కానీ క్రికెటర్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మల వివాహం మాత్రం పెళ్ళి పీటల వరకు వెళ్ళింది. అయితే అంతకుముంద

సాధారణంగా ప్రముఖులు ప్రేమించుకోవడం.. విడిపోవడం జరుగుతుంటుంది. కొంతమంది ప్రముఖుల ప్రేమ... పెళ్లి పీటల వరకూ వస్తే మరికొంతమందికి సగంలోనే ఆగిపోతుంది. కానీ క్రికెటర్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మల వివాహం మాత్రం పెళ్ళి పీటల వరకు వెళ్ళింది. అయితే అంతకుముందు వరకు తనకు అంతగా అదృష్టం లేదని చెప్పిన కోహ్లీ, అనుష్కతో డేటింగ్ ప్రారంభించిన తరువాతనే దశ తిరిగిందంటున్నాడు. 
 
2013 సంవత్సరంలో ఒక ప్రైవేటు యాడ్‌లో కలిసి నటించిన అనుష్క శర్మకు, కోహ్లీకి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. 4 సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. డేటింగ్ ప్రారంభించిన తరువాత నుంచి తను 36 సెంచరీలను చేశానంటున్నాడు కోహ్లీ. 
 
అంతేకాదు 19 వన్డే సెంచరీలు సాధించినట్లు ఆనందంతో చెబుతున్నాడు. అదంతా అనుష్క అదృష్టమని చెబుతున్నాడు కోహ్లీ. అదృష్ట దేవత అనుష్కను వివాహం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు.