శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (08:46 IST)

ఇట్స్ అఫిషియల్ : కోహ్లీ-అనుష్క పెళ్లి చేసుకున్నారు

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మలకు పెళ్లి జరిగిపోయింది. డిసెంబర్ 11వ తేదీ సోమవారం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటై

భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మలకు పెళ్లి జరిగిపోయింది. డిసెంబర్ 11వ తేదీ సోమవారం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌లో వీరి పెళ్లి జరిగింది.
 
టస్కనీ నగరానికి సమీపంలోని 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో వైభవంగా జరిగింది. ఇటలీ వైన్‌ రాజధానిగా పేరు తెచ్చుకున్న మోంటాల్కినోకు గంట ప్రయాణం దూరంలో ఈ సుందరమైన రిసార్ట్‌ ఉంది. విశాలమైన పచ్చిక బయళ్లు, వైన్‌ తోటలతో ఈ ప్రదేశం అత్యంత సుందరంగా ఉంటుంది.
 
ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పెళ్లి తర్వాత డిసెంబర్‌ 21న ఢిల్లీలో అంగరంగ వైభవంగా రిసెప్షన్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు.
 
అయితే, కోహ్లీ, అనుష్క వివాహ రిసెప్షన్‌ను ముంబై, ఢిల్లీలో నిర్వహించనున్నారు. ఈ నెల 21న కుటుంబసభ్యులకు ఢిల్లీలోని తాజ్‌ హోటల్‌ దర్బార్‌ హాల్‌‌లో.. 26న ముంబైలో క్రికెటర్లకు, బాలీవుడ్‌ ప్రముఖులకు విందు ఇవ్వనున్నారు. ఇక ఈ జంట తమ నివాసాన్ని ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న తమ నూతన భవనానికి మార్చనున్నారు.