మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (13:40 IST)

విరాట్ కోహ్లీ, అనుష్కల ఆస్తుల వివరాలు వింటే షాక్ తప్పదు..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ ఆస్తుల వివరాలు అందరికీ షాక్ ఇచ్చేలా చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో కోహ్లీ ఏడవ స్థానం

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించిన విరాట్ కోహ్లీ ఆస్తుల వివరాలు అందరికీ షాక్ ఇచ్చేలా చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో కోహ్లీ ఏడవ స్థానంలో నిలిచాడు. అదే మన దేశంలో అయితే అగ్ర తొలి స్థానంలో నిలిచాడు. అలాగే బాలీవుడ్ అగ్రనాయిక అనుష్క.. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న సెలెబ్రిటీల్లో భారీ మొత్తాన్ని ఆర్జించే నటిగా గుర్తింపు సంపాదించుకుంది. 
 
అనుష్క శర్మ ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది, ఒక్కో చిత్రానికి రూ.5 కోట్ల వరకూ, ఏదైనా కంపెనీకి ప్రచారం తీసుకోవాల్సి వస్తే రూ. 4 కోట్లను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరి వివాహం డిసెంబర్ 12న ఇటలీలో జరగనున్న వేళ, వీరికి ఉన్న ఆస్తుల వివరాలు లీకయ్యాయి. 
 
అనుష్క వద్ద రూ.36 కోట్ల వ్యక్తిగత పెట్టుబడులు ఉండగా, వ్యాపారాల్లో వీరిద్దరి భాగస్వామ్యం మొత్తం కలిపి రూ. 220 కోట్లని తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఆస్తుల విలువ రూ. 300 కోట్లను దాటేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.