ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (11:13 IST)

కోహ్లీ - అనుష్క పెళ్లి వేదిక ఇటలీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవు్డ నటి అనుష్క శర్మల వివాహం ఈనెల 12వ తేదీన జరుగనుంది. ఈ వివాహ వేడుకకు ఇటలీలోని టస్కనీ నగరంలోని ఓ రిసార్ట్‌లో 'విరుష్క'ల వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవు్డ నటి అనుష్క శర్మల వివాహం ఈనెల 12వ తేదీన జరుగనుంది. ఈ వివాహ వేడుకకు ఇటలీలోని టస్కనీ నగరంలోని ఓ రిసార్ట్‌లో 'విరుష్క'ల వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు.
 
ఇందుకోసం వధూవరులతోపాటు ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. డిసెంబర్‌ 26న ముంబైలో అంగరంగవైభవంగా రిసెప్షన్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథమహారథులంతా హాజరుకానున్నారు. 
 
ఈ మేరకు ఇప్పటికే క్రికెటర్లకు, బాలీవుడ్‌ స్టార్లకు ఆహ్వానాలు అందాయి. రిసెప్షన్‌ ముగిసిన మరుసటి రోజే అంటే డిసెంబర్ 27వ తేదీన భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరుతుంది. ఈ జట్టుతో పాటు.. విరాట్ కోహ్లీ కూడా సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు.