సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (12:12 IST)

ఆకాష్ అంబానీ వెడ్డింగ్ కార్డు ధర లక్షన్నర.. పసిడితో చేశారట

ఫోర్బ్స్ మేగజీన్ ముకేష్ అంబానీని భారత్‌లోనే అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో కూడా అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. లగ్జరీ

ఫోర్బ్స్ మేగజీన్ ముకేష్ అంబానీని భారత్‌లోనే అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో కూడా అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. లగ్జరీ జీవితం గడపడంలో ఆకాష్ అంబానీకి మించిన వారు లేరని ఇటీవల జాతీయ మీడియా కోడై కూసింది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఆకాష్ అంబానీ పెళ్లి చేసుకోబోతారని వార్తలు వస్తున్నాయి. పెళ్లి తేదీ ఇంకా ప్రకటించకపోయినా.. పెళ్లి కార్డుకు సంబంధించిన వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి కార్డు ధర లక్షన్నర అని తెలుస్తోంది. 
 
ఇప్పటికే జియో డేటా ద్వారా దాని ఆఫర్ల ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదించిన అంబానీ గ్రూప్.. కుమారుడి పెళ్లి కోసం భారీగా వెచ్చించనుందని సమాచారం. ఈ వెడ్డింగ్ కార్డును పసిడితో తయారు చేశారని తెలిసింది. డిసెంబర్ చివరి వారంలో అంబానీ కుమారుడి వివాహం అట్టహాసంగా జరుగనుందని టాక్.