శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (16:50 IST)

అనుష్క కోసం విరాట్ కోహ్లీ పాట (వీడియో)

టీమిండియా కెప్టెన్, విరాట్ కోహ్లీ, ఫిల్మ్ స్టార్ అనుష్క శర్మ వివాహం చేసుకున్నారు. విరాట్, అనుష్క ఎంగేజ్‌మెంట్, హల్దీ సెర్మనీలకు సంబంధించిన వీడియోలను ఆ పెళ్లికి హాజరైన బంధువులు పోస్ట్ చేశారు. వివాహ ప్ర

టీమిండియా కెప్టెన్, విరాట్ కోహ్లీ, ఫిల్మ్ స్టార్ అనుష్క శర్మ వివాహం చేసుకున్నారు. విరాట్, అనుష్క ఎంగేజ్‌మెంట్, హల్దీ సెర్మనీలకు సంబంధించిన వీడియోలను ఆ పెళ్లికి హాజరైన బంధువులు పోస్ట్ చేశారు. వివాహ ప్ర‌క్రియ‌లో జైమాల సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా చాలా స‌ర‌దాగా సాగుతుంది. విరాట్ కోహ్లీ - అనుష్కల పెళ్లికి సంబంధించిన ఒక్కొక్కటిగా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. 
 
కొత్తగా ప్రత్యక్షమైన వీడియో ఒకటి విరుష్క అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన ప్రేయసి అనుష్క కోసం 'మేరే మెహ‌బూబ్‌' అనే హిందీ రొమాంటిక్ పాట‌ను విరాట్ పాడ‌టం ఈ వీడియోలో ఉంది. వివాహానికి ముందు రోజు రాత్రి జ‌రిగిన పార్టీలో విరాట్ ఈ పాట పాడిన‌ట్లు తెలుస్తోంది. పాట పూర్త‌య్యాక హాజ‌రైన బంధువుల‌తో పాటు అనుష్క కూడా విరాట్‌ను చ‌ప్ప‌ట్ల‌తో అభినందించింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.