గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (10:50 IST)

అవినీతి ప‌రుల‌కు సింహ‌స్వ‌ప్నం మోడీ : కిష‌న్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ఢిల్లీలో పైరవికారులకు స్థానం లేదని బీజేపీ రాష్ట్ర నేత కిష‌న్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్క‌డా అవినీతి లేకుండా పాల‌న అందించాల‌న్న‌దే మోడీ ధ్యేయమన్నారు. అవినీతిపరులకు సింహస్వప్

ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ఢిల్లీలో పైరవికారులకు స్థానం లేదని బీజేపీ రాష్ట్ర నేత కిష‌న్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్క‌డా అవినీతి లేకుండా పాల‌న అందించాల‌న్న‌దే మోడీ ధ్యేయమన్నారు. అవినీతిపరులకు సింహస్వప్నంగా మోడీ తయారయ్యారని చెప్పుకొచ్చారు.
 
అవినీతి పరులు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని భయపడి దేశాన్ని వదిలి పోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడన్నా జరిగిందా..?  ఆలా చేస్తున్నందుకే మోడీని అడ్డుకుంటున్నారా అని ప్ర‌శ్నించారాయ‌న‌.

కాంగ్రెస్ పాలనలో అనేక రకాలుగా రూ.లక్షల కోట్ల దోపిడీ జరిగింది. ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేయాలి. ఎవరు అవునన్నకాదన్న 2019లో నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ఆయన జోస్యంచెప్పారు.