సంబంధిత వార్తలు
- ఆత్మనిర్భర భారత్ : రైతుల ఆదాయం రెట్టింపు .. నిర్మలమ్మ
- బడ్జెట్ 2021-22 : కరోనా కష్టకాలంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం...
- డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రతులు.. మరికొన్ని నిమిషాల్లో వెల్లడి...
- బడ్జెట్ 2021 వ్యాక్సిన్ : హోదా, రైల్వే జోన్ అమలుపై కోటి ఆశలు!
- బడ్జెట్ 2021-22 : పట్టాలెక్కని హామీలు - అమరావతికి రైలు ఊసేది?
బడ్జెట్ 2021-22: వ్యక్తిగత వాహనాలకు కాలపరిమితి .. నిర్మలమ్మ
బడ్జెట్ 2021-22 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ఆరు మూలస్తంభాలను ఆధారంగా చేసుకుని తయారు చేయడం జరిగిందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆమె సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బడ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాలను ఆధారంగా చేసుకుని బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
ఇందులో మొదటిది ఆరోగ్యం, సంరక్షణ, రెండోది ఫిజికల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్‌ఫ్రా, మూడోది సమ్మిళిత వృద్ధి, నాలుగోది హ్యూమన్ క్యాపిటల్, ఐదోది ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (ఆర్ & డీ), ఆరోది కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన అని, ఈ ఆరు మూల స్తంభాలపైనే బడ్జెట్‌ను రూపొందించినట్లు నిర్మల తెలిపారు.
ఇకపోతే, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం స్వచ్ఛభారత్ అర్బన్, ఐదేళ్లలో స్వచ్ఛభారత్ అర్బన్ కోసం రూ.1,41,670 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ముఖ్యంగా, దేశంలోని వాహనాల ఫిట్‌నెస్ పరీక్షకు ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చారు. వ్యక్తిగత వాహనాలకు 20 ఏండ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏండ్లుగా కాలపరిమితి విధించారు. ఈ కాలపరిమితి ముగిసిన తర్వాత ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లాలన్న నిబంధన పెట్టారు
