ఇంట్లో నల్లటి గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ వాడటం మంచిది కాదా?
ఇటీవలి కాలంలో కొంతమంది వాస్తు చెబుతామంటూ కొన్నికొన్ని విషయాలను చెబుతున్నారు. నల్లటి గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ ను వాడటం మంచిది కాదని ప్రచారం చేస్తున్నారు. దీనితో అప్పటికే వేలకు వేలు పెట్టి కొనుగోలు చేసిన గృహిణులు అయోమయంలో పడిపోతున్నారు. ఐతే ఇలాంటి గ్యాస్ స్టవ్‌ను వాస్తుపరంగా వంటగదిలో ధారాళంగా వాడవచ్చు. వస్తువు రకం కంటే స్టవ్ ఉంచే దిశ, దాని పరిశుభ్రత వాస్తులో అత్యంత ముఖ్యం.
వాస్తుపరంగా పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏమిటో తెలుసుకుందాము. వంటగదిలో గ్యాస్ స్టవ్‌ను ఆగ్నేయ మూలలో (South-East) ఉంచాలి. వంట చేసేటప్పుడు తూర్పు దిశ వైపు చూస్తూ వంట చేయడం అత్యంత శుభప్రదం. నల్లటి గ్లాస్ టాప్ స్టవ్‌లు వాడటం సాధారణమే. ఆగ్నేయంలో నలుపు రంగు ప్రభావాన్ని తగ్గించడానికి ఈ స్టవ్ కింద ఒక ఆకుపచ్చ రంగు గ్రానైట్ లేదా మార్బుల్ రాయిని ఉంచడం మంచి పరిహారంగా పనిచేస్తుంది.
వాస్తు ప్రకారం గ్యాస్ స్టవ్ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. దానిపై ఆహార పదార్థాల మరకలు, నూనె జిడ్డు లేకుండా ప్రతిరోజూ తుడిచి ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి మరియు సమృద్ధి పెరుగుతాయి. బర్నర్లు సరిగ్గా వెలుగుతూ ఉండాలి. గ్లాస్ పగలడం లేదా ఏవైనా భాగాలు పాడైపోకుండా చూసుకోవాలి.
