కారంమసాలా వంకాయ
కావలసిన పదార్థాలు :
చిన్న వంకాయలు... పది
ఆవనూనె... అర కప్పు
లవంగాలు... నాలుగు
పులావు ఆకులు... రెండు
ఇంగువ... చిటికెడు
జీలకర్రపొడి... ఒక టీ.
మెంతిపొడి... ఒకటిన్నర టీ.
ఆవపొడి... ఒకటిన్నర టీ.
సోంపు పొడి... ఒక టీ.
కొత్తిమీర పొడి... ఒక టీ.
కారం... రెండు టీ.
పసుపు.... అర టీ.
ఎండుమామిడి పొడి... రెండు టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
వంకాయల్ని బాగా కడిగి తుడవాలి. వాటిని గుత్తివంకాయకూరకు కోసినట్లుగా కాయవిడకుండా నిలువుగా చిలికలు చేసి పక్కనుంచాలి. ఓ గిన్నెలో పైన చెప్పుకున్న పొడులన్నీ వేసి కలిపి అందులోనే ఉప్పు, కారం కూడా వేసి ఈ మిశ్రమాన్ని చిల్చిన వంకాయల్లో కూరాలి.
ఓ పాన్‌లో ఆవనూనె వేసి కాగిన తరువాత లవంగాలు, పలావు ఆకులు, ఇంగువ వేసి వేగాక మిశ్రమం నింపిన వంకాయల్ని కూడా వేసి కొద్దిగా వేయించాలి. తరవాత మూతపెట్టి మధ్యమధ్యలో కదుపుతూ తక్కువ మంటమీద మగ్గనిచ్చి దించేయాలి.