గుత్తువంకాయ ఫ్రై
కావలసిన పదార్థాలు :
లేత గుత్తువంకాయలు-250 గ్రాములు
టమోటా రసం- అరకప్పు
పచ్చిమిర్చి- రెండు టీ స్పూన్లు
గరంమసాలా-అరచెంచా
నూనె-నాలుగు చెంచాలు
పసుపు- అరచెంచా
టమోటా-ఒకటి
కారం, సోపు, జీలకర్ర పొడి, జీలకర్ర-చెరో అర చెంచా
కొత్తిమీర తరుగు-కాసింత
తయారీ విధానం :
లేత వంకాయలను తీసుకుని మధ్య వరకు రెండు గాట్లు పెట్టి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి కాసేపు ఊరనివ్వాలి. ఇంతలో స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి జీలకర్ర వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత కారం, సోపు, పసుపు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుతూ వేపుకోవాలి. కాసేపు వేగాక అందులో టమోటా రసం, కొత్తిమీర కలిపి రెండు నిమిషాల పాటు వేపాలి.
వీటిలో ఉప్పులో ఊరనిచ్చిన వంకాయలను వేసి సరిపడ ఉప్పు చల్లి తగినంత నీరు పోసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. వంకాయలు మగ్గిన తర్వాత దించి బేల్‌లో పెట్టి పైన కొత్తిమీర, టమోటా ముక్కలు చల్లి వేడి వేడిగా వైట్‌రైస్‌తో సర్వ్ చేయాలి.