చీజ్ పొటాటో చిప్స్
|
బంగాళాదుంపలు... ఐదు
చీజ్... ఒక కప్పు
కారం... రెండు టీస్పూన్లు
నూనె... తగినంత
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
బంగాళాదుంపలను పల్చగా చిప్స్‌గా తరగాలి. ఉప్పువేసి, కనీసం అరగంటసేపు ఒక పక్కన ఉంచాలి. చిప్స్‌లో తేమ పూర్తిగా పోయి పొడిగా అయ్యేదాకా ఉంచాలి. ఆ తర్వాత చిప్స్‌పై కారం చల్లాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి తరిగి ఉంచుకున్న బంగాళాదుంప చిప్స్‌లను వేసి బాగా వేయించాలి. చిప్స్ బాగా వేడిగా ఉన్నప్పుడే చీజ్‌ను చిప్స్‌పై చల్లి సర్వ్ చేయాలి. వీటిని వండిన రోజునే తినేయాలి. ఆ తరువాతి రోజుకు నిల్వ ఉండవు.

