1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

తీపి పుదీనా పచ్చడి

వంటకాలు శాకాహారం పుదీనా చింతపండు ఎండుమిర్చి పచ్చి శెనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇంగువ బెల్లం ఉప్పు పసుపు నూనె
కావలసిన పదార్థాలు :
పుదీనా... రెండు కట్టలు
చింతపండు... సరిపడా
ఎండుమిర్చి... పది
పచ్చి శెనగపప్పు.... అర టీస్పూన్
మినప్పప్పు... అర టీస్పూన్
ఆవాలు... ఒక టీస్పూన్
ఇంగువ... పావు టీస్పూన్
బెల్లం... తీపికి సరిపడా
ఉప్పు, పసుపు... తగినంత
నూనె... సరిపడా

తయారీ విధానం :
ముందుగా చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. బాండీలో నూనె వేసి పచ్చిశెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వేగిన తరువాత తీసి పక్కన ఉంచి, మిగిలిన నూనెలో కడిగి ఆరబెట్టి ఉంచిన పుదీనా ఆకులను వేసి బాగా వేయించాలి.

రోట్లో పైన వేయించి పెట్టుకున్న పోపుగింజలు, మిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి బాగా మెత్తగా నూరాలి. దానికి నానబెట్టి ఉంచిన చింతపండు, బెల్లం కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. చివర్లో వేయించిన పుదీనా ఆకులను కూడా వేసి మెత్తగా నూరాలి. రోలు లేనివారు మిక్సీలో వేసుకోవాలి.

ఇప్పుడు నూరి ఉంచుకున్న పుదీనా పచ్చడికి... కాస్తంత నూనెలో ఇంగువ వేసి వేయించి పోపు పెట్టాలి. అంతే ఇంగువ వాసనతో ఘుమఘుమలాడిపోయే తీపి పుదీనా పచ్చడి సిద్ధమైనట్లే..! వెల్లుల్లిపాయలను ఇష్టపడేవారు, వాటిని ఇంగువతో పాటు పోపులో వేయించి పచ్చడిలో కలుపుకోవచ్చు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి