1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం
  6. పండుమిరప పచ్చడి

Red Chilly Chatni | పండుమిరప పచ్చడి

వంటకాలు శాకాహారం పండుమిరప పచ్చడి నీరు నూనె చింతపండు ఉల్లిపాయ ధనియాలు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మెంతులు
కావలసిన పదార్థాలు :
పండుమిరపకాయలు... వంద గ్రా.
నీరు... ఒక గ్లాసు
నూనె... 50 గ్రా.
చింతపండు... 25 గ్రా.
ఉల్లిపాయ... ఒకటి
వెల్లుల్లి రేకలు... ఆరు
ధనియాలు... ఒక టీ.
ఆవాలు... ఒక టీ.
జీలకర్ర... ఒక టీ.
మెంతులు... పావు టీ.
కరివేపాకు... రెండు రెబ్బలు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ముందుగా బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. అందులో మెంతులు, కరివేపాకు, పండుమిర్చి వేసి వాటి రంగు మారకుండా వేయించి దించాలి. అందులోనే చింతపండు, ధనియాలు, జీలకర్ర వేసి అరగంటసేపు నాననివ్వాలి. వీటికి వెల్లుల్లి, ఉల్లిపాయముక్కలు, ఉప్పు కూడా చేర్చి రుబ్బితే... నోరూరించే పండుమిరప పచ్చడి సిద్ధమైనట్లే..! రాయలసీమలో ఇడ్లీల్లోకి, దోసెల్లోకి కలుపుకుని ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి