రాజ్మా మసాలా కర్రీ
కావలసిన పదార్థాలు :
రాజ్‌మా... రెండు కప్పులు
ఉల్లిపాయలు... రెండు
టొమోటో... పెద్దసైజుది ఒకటి
అల్లం వెల్లుల్లి... ఒక టీస్పూన్
పచ్చిమిర్చి... మూడు
టొమోటోలు... మూడు
ధనియాలపొడి... అర టీ.
కారం... ఒక టీ.
గరంమసాలా... అర టీ.
నూనె... రెండు టీ.
కొత్తిమీర... గుప్పెడు
తయారీ విధానం :
రాజ్‌మాను రాత్రంతా నానబెట్టి, బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాగాక... అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. కాసేపటి తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేసి కలియబెట్టాలి. కొద్దిసేపటి తరువాత అందులోనే ఉడికించిన రాజ్‌మా, కారం, ధనియాలపొడి, గరంమసాలాలను వేసి, బాగా కలిపి ఉడికించాలి.
మంట తగ్గించి గ్రేవీ చిక్కబడేంతదాకా ఉడికించి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే రాజ్మా మసాలా కర్రీ సిద్ధమైనట్లే..! దీన్ని వేడి వేడి చపాతీలు, అన్నంలోకి కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.