1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

వంకాయ పులుసు

వంకాయ పులుసు టొమోటాలు చింతపండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు
కావలసిన పదార్థాలు :
వంకాయలు- 1/2కిలో
టొమోటాలు- 10
చింతపండు- 50 గ్రాములు
పచ్చిమిర్చి- 15 కాయలు
ఉల్లిపాయలు- ఆరు
ఎండు మిర్చి, పోపుసామాను- తగినంత
కరివేపాకు- తగినంత
నూనె- 100 గ్రాములు

తయారీ విధానం :
చింత పండును నీళ్ళలో నానబెట్టి వంకాయల్ని రెండేసి భాగాలుగా చీల్చి నీళ్ళలో వేసి ఉంచాలి. టొమోటో, ఉల్లి, మిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి. నూనె కాచి పోపుపెట్టి కరివేపాకు వేగాక ఉల్లిమిర్చి ముక్కులు వేసి ఒక నిమిషం తర్వాత వంకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు, కారం చల్లి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అనంతరం చింతపండును పిండుకుని పల్చగా పులుసులా పోసి టొమోటో ముక్కులను కూడా వేసి ఉడికించుకోవాలి. చివరగా కొంచెం బెల్లం వేసి మరగనిచ్చి దింపుకుంటే వంకాయ పులుసు రెడీ..