1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం

వెజిటబుల్స్‌తో అట్టు

వంటకాలు శాకాహారం పెసర మినప కంది శెనగ పప్పు గంటసేపు నానెబెట్టి రుబ్బు
ND
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు... 150 గ్రాములు
మినపప్పు... 150 గ్రాములు
కందిపప్పు... 150 గ్రాములు
బియ్యము... 150 గ్రాములు
ఆలుగడ్డలు... రెండు
ఉల్లి గడ్డ... ఒకటి
క్యాబేజీ... తరుగు ఒక కప్పు
పచ్చిమిర్చి... తరుగు అర కప్పు
జీలకర్ర... రెండు చెంచాలు
కొత్తిమీర... తరుగు ఒక కప్పు
నూనె... కొద్దిగా
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
పెసర, మినప, కంది, శెనగ పప్పులను గంటసేపు నానెబెట్టి రుబ్బుకోవాలి. ఈ పిండిలో ఉల్లిగడ్డ, క్యాబేజీ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర తరుగుల్ని చేర్చుకోవాలి. ఈ మిశ్రమం ఇడ్లీ పిండిలా తయారైన తర్వాత... కొద్ది కొద్దిగా తీసుకుని పెనం మీద దోసెలుగా పోసి ఎర్రగా కాలిన తర్వాత దించేయాలి. అంతే వెజిటబుల్స్‌తో తయారైన అట్టు సిద్ధమైనట్లే..! దీన్ని వేడిగా ఉన్నప్పుడే, గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి