కర్పూరంతో ఆరోగ్య ప్రయోజనాలేంటో?
కర్పూరంతో ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోండి.. స్వల్ప గుండె సంబంధిత వ్యాధులు, అలసట సమస్యలకు కర్పూరం దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ వాసనను అప్పుడప్పుడు పీల్చుకోవాలి. అలాగే ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారణిగా, నరాల సంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీపు నొప్పికి కూడా కర్పూర తైలాన్ని ఉపయోగించవచ్చు.
పుండ్లు మానడానికి, పిల్లల్లో ఏర్పడే చర్మ వ్యాధులు తగ్గడానికి కర్పూరాన్ని ఉపయోగించుకోవచ్చు. కొబ్బరినూనెతో మరిగించి అందులో కర్పూరం వేసి ఆ నూనెను చర్మ సమస్యలున్న ప్రాంతాల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అదీ మోతాదు మించకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
