1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Railway COVID Guidelines

రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ తప్పనిసరి... లేకుంటే ఫైన్

Railway COVID Guidelines
భారతదేశంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు, నిబంధనలు పొడిగిస్తున్నాయి. కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే… మాస్క్, భౌతిక దూరం, శానిటేషన్ కంపల్సరీ అని ప్రకటిస్తున్నాయి.
 
తాజాగా.. రైల్వే మంత్రిత్వ శాఖ… కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడిగించింది. స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ ధరించలేకపోతే..రూ. 500 జరిమాన విధిస్తామని వెల్లడించింది. ఈ మేరకు 2021, అక్టోబర్ 07వ తేదీ.. గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
 
మరోవైపు..భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి. కొత్తగా 22 వేల 431 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. దేశంలో 2,44,198 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ఇందులో 3,32,00,258 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 4,49,856 మంది మృతి చెందారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
గురువారం పూట తెరుచుకున్న షిర్డీ సాయిబాబా ఆలయం