శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (18:41 IST)

గురువారం పూట తెరుచుకున్న షిర్డీ సాయిబాబా ఆలయం

కరోనా పాండమిక్ నేపథ్యంలో గురువారం పూట షిర్టీ సాయి బాబా ఆలయం తెరుచుకుంది. నవరాత్రుల తొలిరోజు కావడంతో....భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్ణయించింది. రోజూకు 15 వేల భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. 
 
ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేలు ఆన్‌లైన్ పాసులు, మరో 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉన్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతించనున్నారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్ 5న కరోనా కారణంగా షిర్డీ ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 7 నెలల తరువాత ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు