బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (16:54 IST)

రైల్వే స్టేషన్లలో కరోనా ఆంక్షలు పొడగింపు - మాస్క్ లేకుంటే ఫైన్

దేశంలోని రైల్వే స్టేషన్లలో కరోనా ఆంక్షలను పొడగిస్తూ భారతీయ రైల్వే శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడగిస్తున్నట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా, స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్‌ ధరించకపోతే రూ.500 జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. అలాగే, ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వేశాఖ సూచించింది.