నాలుగేళ్ల దళిత బాలుడు గుడిలోకి వెళ్లాడని..
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులవివక్ష కనిపిస్తూనే ఉంటుంది. అగ్ర కులాలు తమ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా కుల వివక్ష ఇంకా నశించిపోలేదు అన్నదానికి ఉదాహరణగా ఓ ఘటన చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం కొప్పాల్‌లోని మియాపురా గ్రామంలో పుట్టిన రోజు సంధర్బంగా నాలుగేళ్ల బాలుడు స్థానిక గుడిలోకి వెళ్లాడు. అయితే దళితుడు కావడంతో ఆ బాలుడి తండ్రికి గ్రామ పెద్దలు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపింది.
నాలుగేళ్ల బాలుడు గుడిలోకి వెళ్లినందుకు కానూ అతడి తండ్రికి ఏకంగా ముప్పై వేల జరిమానా విధిస్తూ గ్రామ పెద్దలు నిర్నయం తీసుకున్నారు. రూ.25 ఫైన్ వేయడంతో పాటు గుడిని శుభ్రపరిచేందుకు రూ.10 వేల రూపాయలు కట్టాలని జరిమానా విధించారు.
అయితే ఆ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు గ్రామ పెద్దలను నిలదీశారు. దాంతో గ్రామ పెద్దలు తప్పు జరిగిపోయిందని మరోసారి అలా చేయమని క్షమాపణ చెప్పినట్టు గ్రామ తహసిల్దార్ సిద్దేష్ తెలిపారు.