మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:14 IST)

రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకొచ్చాయ్... సోనూసూద్

బాలీవుడ్ హీరో సోనూసూద్ పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచాడు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న సమయంలో ఆపన్న హస్తం అందించి ఆదుకున్న సోనుసూద్.. ప్రభుత్వాల కంటే మెరుగ్గా ప్రజలకు సేవలు అందించాడు. అయితే తాజాగా ఆయన ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. ఇంకా పన్ను ఎగవేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై సోనూ స్పందిస్తూ.. అవన్నీ కష్టపడి పోగు చేసిన డబ్బన్నారు. 
 
కాలమే ఇందుకు బదులిస్తుందని చెప్పుకొచ్చారు. తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని చెబుతూ.. తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ఇప్పటికే ముందుకు వచ్చాయని వెల్లడించారు. కానీ, రాజకీయాల్లో చేరేందుకు ప్రస్తుతం మానసికంగా సిద్ధంగా లేనని చెప్పిన సోనూసూద్.. వాటిని నిరాకరించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 
ఈ సంధర్భంగా రాజకీయాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు తానే స్వయంగా వివరాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. సాయం కోసం చూసే ప్రజలకు.. విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలో ప్రతీ రూపాయి పనిచేస్తుంది. 
 
నాకు వచ్చిన డబ్బు మొత్తం డొనేషన్లు మాత్రమే కాదు.. బ్రాండ్ అంబాజిడర్‌గా వ్యవహరించినందుకు వచ్చిన డబ్బును కూడా సమాజం కోసం ఉపయోగించాలని, దానికోసమే డబ్బును ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సోనూ సూద్ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయించాడు.