బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (12:52 IST)

ఆస్తులపై ఐటీ సోదాలు.. సోనూసూద్‌ ఏమన్నారంటే?

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఆస్తులపై ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని ఆయన నివాసంతోపాటు.. నాగ్‌పూర్‌, జైపుర్‌లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోనూ సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తైన తర్వాత ఐటీ అధికారులు సోనూసూద్.. రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని వెల్లడించారు. తాజాగా సోనూసూద్ తనపై జరిగిన దాడులకు సంబంధించి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
 
నా ఫౌండేషన్‌లో ప్రతి రూపాయి కూడా నిరుపేదల జీవితాల కోసం పోగు చేసిందే. మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించాను. నాలుగు రోజులుగా నేను నా అతిథులు (ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నాను. ఆ కారణం వల్లనే మీ సేవలోఉండలేకపోయాను. ఇప్పుడు తిరిగి వచ్చాను అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సోనూసూద్‌.